జిల్లాలో పదిలో వంద శాతం ఫలితాలే లక్ష్యం డిసెంబర్ ఒకటి నుంచి ప్లాన్ అమలు ఇప్పటికే 85 శాతం సిలబస్ పూర్తి పరువు దక్కించుకునే ప్రయత్నంలో జిల్లా విద్యాశాఖ
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తు న్న పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వందరోజుల యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయనున్నట్లు డీ ఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. ఇందులో ప్రధానంగా విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్పె షల్ క్లాసులు నిర్వహించాలని అయన ఆదేశించారు. ప్రతి విద్యార్థినీ సంబంధిత ఉపాధ్యాయులు దత్తత తీసుకుని, వారి అభ్యసన స్థాయిని నిరంతరం పరిశీలించాలని తెలిపారు. ఏదైనా పాఠ్యాంశంలో వెనకబడి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, రివిజన్ సెషన్లు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతిరోజు ఒక పాఠ్యాంశం చొప్పున రివిజన్ చేయాలని, ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తిరుపతి సిటీ: జిల్లా విద్యాశాఖ పది ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పది ఫలితాల్లో జిల్లాస్థాయి ర్యాంకు 19కి పడిపోయింది. దీంతో ఇటు రాష్ట్రాస్థాయి అధికారులు, అటు జిల్లా పేరు ప్రతిష్టలు ది గజారి పోవడంతో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాది కంటే పదో తరగతి ఫలితా లు మెరుగుపరిచి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానాన్ని సాధించాలని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్‌కు అధికారులు రూపకల్పన చేశారు.
ఉత్తమ ఫలితాలకు పది సూత్రాలు
ప్రథమస్థానంలో నిలిపేందుకు..
డిసెంబర్ ఒకటో తేదీ నుంచి జిల్లాలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలులోకి రానుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేయడానికి అన్ని చర్యలు తీసుకోనున్నాం. చదువులో కాస్త వెనుకబడిన విద్యార్థులను సైతం ఈ యాక్షన్ ప్లాన్‌తో వారిని ఉత్తీర్ణత దిశగా సన్నద్ధం చేస్తాం. వచ్చే ఏడాది పది ఫలితాల్లో తిరుపతి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాం.
–కేవీఎన్ కుమార్, డీఈఓ, తిరుపతి
100 రోజుల యాక్షన్ ప్లాన్
పర్యవేక్షణ..పాఠశాలల సందర్శన
మండల, జిల్లాస్థాయి విద్యాశాఖాధికారులు నిత్యం పాఠశాలలను సందర్శించి, బోధన విధానం, విద్యార్థుల అభ్యసన స్థాయిపై సూచనలు జారీ చేస్తున్నారు. పాఠశాలలో సిలబస్ పూర్తి చేయని ఉపాధ్యాయులు పక్కా ఈ నెల 30వ తేదీలోపు సిలబస్ పూర్తి చేసి తీరాల్సి ఉంది. స్లో లెర్నర్స్ కోసం ఇప్పటికే స్టడీ మెటీరియల్ ప్రతి పాఠశాలకు అందించారు.
జిల్లాలో పది ఫలితాల వివరాలు
సంవత్సరం హాజరైన విద్యార్ధులు ఉత్తీర్ణులు ఉత్తీర్ణత శాతం రాష్ట్రస్థాయి ర్యాంకు(స్థానాల్లో)
2022–23 26,388 19,976 75.70 8
2023–24 26,625 24,151 90.71 10
2024–25 26,679 21,298 79.83 19
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం


