తిరుమలలో సంప్రదాయ ఆహారం అందించాలి
తిరుమల: తిరుమలలోని దుకాణాల్లో భక్తులకు సంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పద్మావతి అతిథి భవనంలో పలు శాఖలతో సమన్వయ సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలోని దుకాణ యజమా నులు భక్తులకు నాణ్యమైన, రుచికరమైన సంప్రదాయ ఆహారాన్ని అందించేలా స్థిరమైన విధానాన్ని అమలు చేయాలన్నారు. అలాగే తిరుమలలో పచ్చదనం పెంచడంతోపాటు ఔషధవనాన్ని ఏర్పాటు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు. దాతలతో తిరుమలలోని ఉద్యానవనాలను సుందరీకరించాలని సూచించారు. అనంతరం ఆరోగ్య విభాగం, ఎఫ్‌ఎంఎస్ సేవలు, తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యా ర్థం ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ బోర్డులు, శ్రీవారి సేవ, వైద్య, ఐటీ, కళ్యాణ కట్ట విభాగాల పనితీరు, తదితర అంశాలను కూడా సమీక్షించారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అ ర్ధరాత్రి వరకు 66,322 మంది స్వామివారిని ద ర్శించుకున్నారు. 26,000 మంది భక్తులు తలనీ లాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూ పంలో హుండీలో రూ.3.74 కోట్లు సమర్పించా రు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారు స్వా మిని దర్శించుకోవడానికి 12 గంటల స మయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికె ట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
శ్రీవారికి వెండి గంగాళం సమర్పణ
తిరుమల: హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు తిరుమల శ్రీవారికి మంగళవారం ఉదయం రూ.30 లక్షలు విలువైన 22 కేజీల వెండి గంగాళం సమర్పించారు. శ్రీవారి ఆలయం ఎదుట ఆలయాధికారులకు గంగాళాన్ని అందజేశారు.
విధుల నుంచి టీచర్ల తొలగింపు
తిరుపతి సిటీ: సమాచారం లేకుండా విధులకు హాజరు కాని ఇద్దరు ఉపాధ్యాయులను తొలగించినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. జిల్లాలోని రేణిగుంట మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు పి దేవరాజులు 2022 జూన్ నుంచి విద్యాశాఖాధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, విధులకు హాజరు కావ డం లేదని ఆయన తెలిపారు. దీంతో పలుసార్లు ఆయనకు వ్యక్తిగతంగా స్థానిక మండల అధికారులతో సమాచారం అందించడంతోపాటు పోస్టల్ ద్వారా సమాచారం అందించినా పట్టించుకోకపోవడంతో ఆయన్ని విధుల నుంచి తొలగించాని డీఈఓ తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి మండలంలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు ఏ బాలకృష్ణ 2023వ తేదీ జనవరి నుంచి విధులకు హాజరు కాకపోవడంతో పలుసార్లు మండల వి ద్యాశాఖాధికారులు మెమోలు ఇచ్చారని డీఈఓ తెలిపారు. దీంతో పత్రికా ముఖంగా సైతం ఆయనకు సమాచారం అందించడం జరిగిందన్నారు. ఆయన స్పందించకపోవడంతో విధుల నుంచి తొలగించామని డీఈఓ తెలిపారు.


