
రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా
– నవంబర్ 5వ తేదీకి మార్పు
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నవంబర్ 5న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా జీశాట్–7ఆర్ అనే సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. అయితే ఈ ప్రయోగాన్ని ఈనెల 16న చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక పరమైన కారణాలతో 25వ తేదీకి వాయిదా పడింది. మళ్లీ 25 నుంచి నవంబర్ 5కి వాయిదా వేశారు. దీనికి తోడు ఈ ప్రయోగంలో అమెరికాకు చెందిన బ్లాక్–2 బ్లూబర్డ్ అనే ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా ప్రయోగించాల్సి ఉన్నప్పటికీ ఉపగ్రహం రావడం ఆలస్యం కావడంతో జీశాట్–7ఆర్ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని అనుకున్నారు. ఇందులో కూడా కొన్ని సాంకేతిక కారణాలతో 25న అనుకున్న జీశాట్–7ఆర్ ప్రయోగాన్ని నవంబర్ నెల 5న ప్రయోగించనున్నారని తెలుస్తోంది. 2013 ఆగస్టు 30న ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి పారిస్‌కు చెందిన అరైన్–5 రాకెట్ ద్వారా జీశాట్–7 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ప్రస్తుతం ఆ ఉపగ్రహం కాలపరిమితి అయిపోవడంతో దాని స్థానంలో జీశాట్–7ఆర్ పేరుతో ఉపగ్రహాన్ని పంపనున్నారు.
రేపు విద్యాసంస్థలకు సెలవు
తిరుపతి సిటీ:జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల లకు సోమవారం మాత్రమే దీపావళి పర్వదినానికి సంబంధించి ప్రభుత్వ సెలవు ప్రకటించిందని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నోములు ఉన్న ఉపాధ్యాయులు స్థానిక అధికారు ల అనుమతితో అదనంగా లోకల్ హాలీడేకి అను మతి పొందాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.