
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
చిట్టమూరు : నాయుడుపేట– మల్లా రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. కోట మండలం జరుగుమల్లికి చెందిన ఉదయగిరి సుధీర్(24) నాయుడుపేట మండలం మేనకూరు వద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కోటలో తన స్నేహితుడి పెళ్లికి వెళ్లేందుకు మరో మిత్రుడు శివతో కలిసి బైక్‌పై బయదేరాడు. మార్గం మధ్యలో చిట్టమూరు మండలం కొత్తగుంట వద్ద ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో సుధీర్ అక్కడికక్కడే మరణించాడు. శివ తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్‌ఐ చిన్న బలరామయ్య వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వాకాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని నాయుడుపేట ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.