
రిజిస్ట్రేషన్‌కు స్లాట్ తప్పనిసరి
తిరుపతి అర్బన్ : ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలని ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్ అరుణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు చేపట్టారు. అరుణ్‌కుమార్ మాట్లాడుతూ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 మధ్యలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చునని చెప్పారు. ఆ మేరకు నిర్ణీత సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఒక సబ్ రిజిస్టార్ ఉన్న కార్యాలయంలో గరిష్టంగా 39 స్లాట్లు, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నచోట గరిష్టంగా 78 స్లాట్లను రోజూ కేటాయిస్తామని వివరించారు. పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్.ఏపీ.జీవోవీ.ఇన్‌లోని స్టాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అలాగే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి స్లాట్ పొందవచ్చని తెలిపారు.