
దుకాణాల కూల్చివేతపై ధర్నా
తిరుపతి తుడా : పేదలపై కార్పొరేషన్ అధికారులు ప్రతాపం చూపించడం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మండిపడ్డారు. బొంతాలమ్మగుడి వద్ద చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించినందుకు బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యలో ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె.రాధాకృష్ణతో కలసి మురళి మాట్లాడుతూ ప్రత్నామ్నాయ స్థలం చూపించకుండా వీధి వ్యాపారుల పొట్టకొట్టడం దారుణమన్నారు. నగరంలో కూటమి నేతలు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా మామూళ్ల వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రధానంగా జనసేన నేతల దందాలు పెరిగిపోయాయని విమర్శించారు. అన్నీ తెలిసినా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు బాలాజీ, మూర్తి కుట్రపూరితంగా వీధి వ్యాపారుల షాపులు తొలగించారని, ఇప్పుడు అదే స్థంలో జనసేన నేతల ఆధ్వర్యంలో దుకాణాలు పెట్టించారని మండిపడ్డారు. నేతలు సుబ్రమణ్యం, బుజ్జి, వేణు గోపాల్, కేవై రాజా, ఎమ్‌డీ రవి, సీహెచ్ శివకుమార్, మణి, ఎన్.శివ, వెంకటేష్, సురేష్, మహేంద్ర, రైల్వే బాల, ప్రమీల, శ్రీనివాసులు, బాలాజీ, సుధాకర్, రమేష్, దీపక్ పాల్గొన్నారు.

దుకాణాల కూల్చివేతపై ధర్నా