ఓం శుపథం మల్టీ స్పెషాలిటీ ఆసస్పత్రి ప్రారంభం
తిరుపతి తుడా: స్థానిక భవానీ నగర్‌లో ఆదివారం ఓం శుపథం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని అతిథులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్‌రెడ్డి, వన్నెకుల క్షత్రియ సంఘం చైర్మన్ సీఆర్ రాజన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్, మేయర్ డాక్టర్ శిరీష ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఎండీ డాక్టర్ టి విఠల్‌మోహన్ మాట్లాడుతూ ఆస్పత్రిలో అర్థోపెడిక్, జనరల్ సర్జరీ, గైనిక్ మెటర్నటీ, జనరల్ మెడిసన్, ఫిజియోథెరఫీ తదితర సౌకర్యాలు ఆస్పత్రిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, డాక్టర్ కే సుభాషిణి, వైద్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.


