రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ 'తెలుగు తమ్ముళ్లు'! | - | Sakshi
Sakshi News home page

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ 'తెలుగు తమ్ముళ్లు'!

Jan 12 2024 1:02 AM | Updated on Jan 12 2024 3:23 PM

- - Sakshi

తిరుపతి: మండలకేంద్రంలో తెలుగు తమ్ముళ్లు సరికొత్త వ్యాపారానికి తెరతీశారు. టీడీపీ నేత పులివర్తి నాని అనుచరులు సారా తయారీలో తలమునకలై ఉన్నారు. గుట్టుచప్పుడు కాకుండా సారా తయారు చేసి మండల వ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులు గుర్తించారు. చంద్రగిరి మండలం, కొటాలలో సారా తయారీ చేస్తున్నారనే సమాచారంతో గురువారం ఎస్‌ఈబీ సీఐ లీలాకుమారి ఆధ్వర్యంలో దాడులు చేశారు. కొటాల ఎస్టీ కాలనీకి సమీపంలోని అటవీ ప్రాంతంలో సారా ఊటను స్వాధీనం చేసుకున్నారు.

ఇందులో కొటాల పంచాయతీకి చెందిన టీడీపీ నేత పులివర్తి నాని అనుచరుడు చెంగయ్యతో పాటు మరో ముగ్గురున్నట్టు ఎస్‌ఈబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సారాతో పాటు చెంగయ్యను చంద్రగిరి ఎస్‌ఈబీ కార్యాలయానికి తరలించారు. తమదైన శైలిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో చెంగయ్యతో పాటు మరికొంత మంది తెలుగు తమ్ముళ్లు ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అంతేకాకుండా నిందితులు గతకొంత కాలంగా ఇక్కడి నుంచి తయారు చేస్తున్న సారాను మండల వ్యాప్తంగా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన నిందితుడి కుమారుడు కూడా ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసుల్లో నిందితుడిగా జైలుశిక్ష అనుభవించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఇవి చదవండి: Suchana Seth: బ్యాగులో మద్యం బాటిళ్లున్నాయ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement