Yoga Family: టీవీ, పుస్తకాల్లో చూసి ఆసనాలు, జాతీయ స్థాయిలో సత్తా! 

Yoga Day Inspirational Story From Mahabubnagar - Sakshi

సాక్షి, నవాబుపేట(మహబూబ్‌నగర్‌): గురువు లేకున్నా.. కేవలం టీవీలో చూడటం, పుస్తకాల్లో చదవుతూ యోగా ఆసనాలు వంట పట్టించుకున్నాడు మరికల్‌కు చెందిన పురుష్తోత్తం. ఎలాంటి ఆసనాలైన సులువుగా చేయగల సమర్థుడు. ఏకంగా గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. యోగా ఆసనాల్లో ఆయనది ప్రత్యేక రికార్డు. మూడు సార్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కాగా.. ఎనిమిది సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించాడు.   

యోగా కుటుంబం.. 
నవాబుపేట మండలంలోని మరికల్‌కి చెందిన పురుషోత్తం గురువు లేకుండానే యోగాలో అగ్రస్థాయికి ఎదిగాడు. తనతో పాటు భార్య నిర్మల, కూతురు ఝాన్సిరాణి, కుమారుడు చరణ్‌లకు సైతం యోగాలో తానే శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాడు. దీంతో ఆయన కుటంబమే యోగా కుటుంబంగా మారింది. ఇప్పటికే ఆయన కూతురు, కుమారుడు పాఠశాల, కళాశాల సారథ్యంలో జిల్లా స్థాయి పథకాలు సాధించారు. భార్య మరికల్‌లో మహిళలకు.. పురుషోత్తం యువకులకు శిక్షణ ఇస్తున్నారు. 

సాధించిన పథకాలు..  
► 2014లో యోగా ఫెడరేషన్‌ ఆప్‌ ఇండియా ద్వారా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రాçష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించి బంగారు పథకం. 
► 2015లో  నిజామాబాద్‌లో రాష్ట్ర స్థాయి ద్వితీయ పథకం పొందాడు. 2016లో మరోసారి రాష్ట్ర స్థాయి బంగారు పతకం పొందాడు. 
► 2016లో కర్ణాటక రాష్ట్రం మంగళూరులో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరోసారి 5వ స్థానంలో నిలిచాడు. 
► 2016లో దక్షిణ భారత దేశ జాతీయ స్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించాడు.
► 2017– 2018  సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని నాల్గవ స్థానం సాధించాడు.  

చదవండి: International Yoga Day 2021: ధ్యానం... ఒక యోగం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top