విన్సన్‌ పర్వతంపై భారత జెండా రెపరెపలు 

Yadadri Bhuvanagiri Girl Climbed Highest Mountain In Antarctica - Sakshi

మరో పర్వతాన్ని ఎక్కిన అన్వితారెడ్డి    

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి అంటార్కిటికాలోని విన్సన్‌ పర్వతాన్ని అధిరోహించారు. ఈ నెల 2న హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఆమె అంటార్కిటికా చేరుకుని అక్కడ నుంచి 8న బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నారు. మైనస్‌ 25 నుంచి మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న 4,892 మీటర్ల ఎత్తయిన విన్సన్‌ పర్వతాన్ని ఈ నెల 16వ తేదీన ఉదయం అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

అన్వితారెడ్డి సెప్టెంబర్‌ 28న నేపాల్‌లోని మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అలాగే 2021 మేలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతం, జనవరి 21న దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో, డిసెంబర్‌ 7వ తేదీన యూరప్‌లోని ఎల్‌బ్రోస్‌ పర్వతాలను ఎక్కారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top