బీటీ పత్తి.. ఓ సాగు వైఫల్యం 

World Class Economists Believe That BT Cotton Is Failure - Sakshi

దేశ పరిస్థితులకు అనుగుణంగా లేదు

అంతర్జాతీయ వెబినార్‌లో శాస్త్రవేత్తల అభిప్రాయం

సాక్షి, హైదరాబాద్‌: బీటీ పత్తి.. ఓ సాగు వైఫల్యమని ప్రపంచ స్థాయి వ్యవ సాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ తొలి జన్యు మార్పిడి బీటీ పత్తి పంట దేశ పరిస్థితులకు అనుగుణంగా లేదని వారు పేర్కొంటున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్‌ఏ), జతన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో దేశంలో 18 ఏళ్ల బీటీ పత్తి సాగుపై సాక్ష్యాలతో కూడిన సమీక్ష చేపట్టారు. ఈ వెబినార్‌లో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ ఆండ్రూ పాల్‌ గుటిఎరేజ్, కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవ్‌ క్రాంతి, ఎఫ్‌ఏవో మాజీ ప్రతినిధి డాక్టర్‌ పీటర్‌ కెన్మోర్‌లతో పాటు 500 మంది వరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1960, 70లలో కాలిఫోర్నియాలో పురుగు మందులను వాడటం వల్ల తెగుళ్లు ప్రబలాయని, దీని నుంచి భారతదేశం గుణపాఠం నేర్చుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానిం చారు. 2005లో 11.5 శాతం, 2006లో 37.8 శాతం, 2011లో దాదాపు అత్యధిక విస్తీర్ణానికి బీటీ పత్తి సాగు పెరిగినా పురుగు మందుల వాడకంలో నియంత్రణ రాలేదని, దిగుబడి పెంపులో కూడా ఎలాంటి మార్పు బీటీతో సాధ్యం కాలేదన్నారు. పురుగు మందుల వాడకం, తెగుళ్ల నియం త్రణలో భాగంగా పర్యావరణ సమ స్యలు తీవ్రంగా తలెత్తుతున్నాయని, దీని వల్ల రైతులు కూడా ఇతర విత్తనాల వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు. ఈ వెబినార్‌ నిర్వహణకు అలయన్స్‌ ఫర్‌ సస్టైనబుల్‌ అండ్‌ హోలిస్టిక్‌ అగ్రికల్చ రల్‌ (ఆషా), ఇండియా ఫర్‌ సేఫ్‌ ఫుడ్‌ సంస్థలు సహకారం అందించాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top