అనాథకు తలకొరివి పెట్టిన ముస్లిం మహిళ 

Woman Performs Funeral Of Orphan Kazipet Warangal - Sakshi

కాజీపేట: బంధుమిత్రుల నిరాదరణకు గురై అనాథ ఆశ్రమంలో ఉంటూ బతుకు వెళ్లదీస్తున్న ఓ వృద్ధుడు శుక్రవారం గుండెపోటుతో తనువు చాలించాడు. దీంతో సహృదయ అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబ్‌బీ కట్టుబాట్లను పక్కనబెట్టి తలకొరివి పెట్టింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన కోమాండ్ల వీరస్వామి, శోభ దంపతులు. వీరికి పిల్లలతో పాటు ఆస్తిపాస్తులు లేవు.

ఈ క్రమంలో జీవిత చరమాంకంలోకి అడుగిడిన ఈ దంపతుల దీనగాథను 2017లో ‘సాక్షి’వెలుగులోకి తీసుకురాగా, కాజీపేటలోని సహృదయ అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబ్‌బీ, చోటు దంపతులు అక్కున చేర్చుకున్నారు. ఇందులో వీరస్వామి శుక్రవారం మృతి చెందగా.. యాకూబ్‌బీ హిందూ సాంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహించింది.

చదవండి: ఆరేళ్లుగా కుమార్తె అస్థికలు భద్రపరిచి.. 
బాలికకు కరోనా తెచ్చిన కష్టం!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top