గ్రామాభివృద్ధి కమిటీ అరాచకం.. 70 దళిత కుటుంబాల బహిష్కరణ

సాక్షి, నిజామాబాద్: జిల్లాలో గురువారం అమానుష సంఘటన చోటుచేసుకుంది. డిచ్‌పల్లి మండలం దూస్‌గామ్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆరాచకాలు మితిమీరాయి. గ్రామంలోని 70 దళిత కుటుంబాలను వీడీసీ బహిష్కరించింది. డప్పులు కొట్టేందుకు కూలి పెంచమని అడిగిన కారణంగా 70 కుటుంబాలను వీడీసీ సభ్యులు బహిష్కరణ చేశారు. గ్రామంలో దళిత కుటుంబాలకు విధి లైట్లు , మంచి నీటి సరఫరా నిలిపివేశారు.
అయితే వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని దళిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కలెక్టరేట్‌కు తరలివచ్చిన బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని కోరుతున్నాయి.
చదవండి: ఫ్లూ మాదిరిగా ఇకపై ఏటా కరోనా ప్రభావం