స్టేషన్‌లోనే దొరికిన దానితో దంచేసుకున్నారు!

పోలీస్ స్టేషన్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
కామారెడ్డి జిల్లా గాంధారిలో ఘటన
సాక్షి, కామారెడ్డి: గాంధారి పోలీస్ స్టేషన్‌లో గండివేట్ గ్రామానికి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కుర్చీలు, కర్రలు, అందుబాటులో ఉన్న వస్తువులతో ఓ వర్గంపై మరో వర్గం పరస్పరం దాడులు చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గండివేట్ గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో గాంధారి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ వివాదం మరింత ముదరడంతో పోలీస్ స్టేషన్‌లోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పీఎస్‌లోనే కొట్టుకోవడంతో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి