విషాదం: ఒకే ఇంట్లో ఒక రోజు వ్యవధిలో ఇద్దరు మృతి | Two Dies Within One Day In Same Family Warangal | Sakshi
Sakshi News home page

విషాదం: ఒకే ఇంట్లో ఒక రోజు వ్యవధిలో ఇద్దరు మృతి

Dec 24 2021 10:07 AM | Updated on Dec 24 2021 10:26 AM

Two Dies Within One Day In Same Family Warangal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,బయ్యారం(వరంగల్‌): మండలంలోని గౌరారం పంచాయతీ పరిధి కోడిపుంజుల తండాలో ఒకే రోజు మునిమనవరాలు, తాతమ్మ మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది. సమయానికి వైద్యం అందక గర్భిణి రేణుక ప్రసవ సమయంలో బుధవారం మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. రేణుక మృతదేహాన్ని బుధవారం రాత్రి ఇంటికి తీసుకురాగా విషయం తెలుసుకున్న జాంకీ(80) గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.

ఒకే ఇంట్లో ఒక రోజు వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రేణుక, జాంకీ మృతదేహాలకు జెడ్పీ చైర్‌పర్సన్‌ బిందు గురువారం నివాళులు అర్పించారు. వైస్‌ ఎంపీపీ గణేశ్, సర్పంచ్‌ వెంకన్న, ఎంపీటీసీ భద్రయ్య, సొసైటీ వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ మండల ప్రధానకార్యదర్శి రాంమూర్తిగౌడ్, నాయకులు లక్ష్మణ్‌నాయక్, రామారావు, లింగయ్య, మల్సూర్‌ నివాళులు అర్పించారు.

చదవండి: కన్నడ అబ్బాయి వియత్నాం అమ్మాయి.. అలా ఒక్కటయ్యారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement