
రాష్ట్రంలోని గోదాముల్లో 66.65 ఎల్‌ఎంటీ నిల్వ సామర్థ్యం
ప్రస్తుతం 6 ఎల్‌ఎంటీకి మాత్రమే ఖాళీ
మిల్లుల నుంచి రావాల్సిన 20 ఎల్‌ఎంటీ సీఎంఆర్ నిల్వలకు కనిపించని చోటు
ఎఫ్‌సీఐ గోదాముల్లోని 21 ఎల్‌ఎంటీ బియ్యాన్ని ఖాళీ చేయాలని కేంద్రాన్ని కోరిన మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గోదాముల కొరత తీవ్రమ వు తోంది. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఏయేటికాయేడు పెరుగు తూ, దేశానికి అత్యధిక మొత్తంలో బియ్యం అందిస్తున్న తెలంగాణలో వాటిని నిల్వ చేసేందుకు సరిపడా గోదాము లు లేకుండా పోయాయి. బియ్యంతోపాటు ఇతర ఆహార ధాన్యాలు, కేంద్రం నుంచి వచ్చే ఎరువుల నిల్వలకు కూడా గోదాములు లేని పరిస్థితి. కొత్తగా గోదాముల నిర్మా ణానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు నత్తన డకన సాగుతున్నాయి.
వానాకాలం ధాన్యం, ఇతర పంటలు మా ర్కెట్‌లోకి వస్తే వాటి నిల్వ కోసం తిప్పలే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గోదాముల్లో ఉన్న నిల్వలను ఖాళీ చేయించేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ఆహా ర శాఖకు లేఖ రాశారు. ప్రత్యేక రైల్వే ర్యాక్స్ ఏర్పాటు చేసి గోదాముల్లో నిల్వ ఉన్న ఎఫ్‌సీఐ బియ్యాన్ని అవస రమైన రాష్ట్ర్లాలకు పంపించాలని కోరారు. దీనిపై కేంద్రం సాను కూలంగా స్పందించిందని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పి నప్పటికీ, కేంద్రం నుంచి ఇంకా రైల్వే ర్యాకులు రాలేదు.
ఎక్కడ నిల్వ చేయాలి?
రాష్ట్రంలోని అన్ని గోదాముల సామర్థ్యం కలిపి 66.65 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్‌ఎంటీ). వీటిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థవి, అద్దెకు తీసుకున్నవి కలిపి మొత్తం సామర్థ్యం 29.50 ఎల్‌ఎంటీలు. ఎఫ్‌సీఐ అధీనంలో 22.61 ఎల్‌ఎంటీల నిల్వ సామర్థ్యం గల గోదాములు ఉండగా, వాటిలో 21.72 ఎల్‌ఎంటీ మేర బియ్యం ఉన్నాయి. రాష్ట్ర గిడ్డంగుల్లో రేషన్ దుకాణాలకు సరఫరా చేసే సన్న బియ్యం ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పర్యవేక్షణలో ఉన్న వాటిలో కూడా ఖాళీ లేదు. ప్రస్తుతం 6 ఎల్‌ఎంటీలు మాత్రమే ఖాళీగా ఉంది. ప్రైవేటు వ్యాపారులకు మరో 5 లక్షల టన్నుల ఎరువుల నిల్వకు గోదాములు కావాలి. ఈ నేపథ్యంలో కొత్తగా మార్కెట్లకు వచ్చే ధాన్యం, దాన్ని మరపట్టిస్తే వచ్చే బియ్యం, మొక్కజొన్నలు, శనగలు, వేరుశనగలు ఎక్కడ నిల్వ చేయాలనేది సమస్యగా మారింది.
80 ఎల్‌ఎంటీల ధాన్యం సేకరణ లక్ష్యం
రాష్ట్రంలో వరికోతలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోప్రారంభం కాగా, వచ్చే వారానికల్లా మరిన్ని జిల్లాల్లో మొదలుకానున్నాయి. ఈసారి రాష్ట్రంలో 68 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 148.30 ఎల్‌ఎంటీల ధాన్యం దిగుబడి అవుతుందని, అందులో 80 ఎల్‌ఎంటీ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఈ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి నేరుగా రైస్‌మిల్లులకు పంపించి, మరాడించిన బియ్యం (సీఎంఆర్)ను ఎఫ్‌సీఐతోపాటు సీడబ్ల్యూసీ, ఇతర గోడౌన్‌లకు పంపిస్తారు.
80 ఎల్‌ఎంటీ ధాన్యాన్ని సీఎంఆర్‌గా మిల్లింగ్ చేస్తే 54 ఎల్‌ఎంటీ బియ్యం వస్తుంది. ప్రస్తుతం రైస్ మిల్లుల వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసే ప్రక్రియ సాగుతోంది. తద్వారా 20 ఎల్‌ఎంటీల బియ్యం రానున్నాయి. వీటిని నిల్వ చేసేందుకు గోదాములు అవసరం. కాగా ప్రస్తుతం ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వ ఉన్న 21 ఎల్‌ఎంటీల బియ్యం నిల్వలను ఖాళీ చేస్తే తప్ప మిల్లుల నుంచి వచ్చే బియ్యాన్ని నిల్వ చేసే అవకాశం ఉండదు.