నగరంలో స్టాండప్ కామెడీ షోస్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. సిటీ కేఫ్స్‌లో స్టాండప్ కామెడీ ప్రదర్శన నిర్వహించని టాప్ కేఫ్ అంటూ ఉండదంటే అతిశయోక్తి లేదు. ఈ హాస్యపు జల్లులో తడిసి ముద్దయే వారిలో అత్యధికులు ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలవారే. ఈ నేపథ్యంలో సిటీ కేఫ్స్‌లో అత్యంత అరుదుగా మాత్రమే వినిపించే తెలుగు కామెడీ మరోసారి నగరవాసులకు వీనుల విందు చేయనుంది. కెపీహెచ్‌బీలో ఉన్న ది హ్యాష్‌ట్యాగ్ కేఫ్‌లో సోమవారం నిర్వహిస్తున్న ఓపెన్ మైక్ ఈవెంట్‌లో తెలుగు స్టాండప్ కమెడియన్లు సాయంత్రం నుంచి సందడి చేయనున్నారని నిర్వాహకులు తెలిపారు.


