Telangana State Police : పోలీసుశాఖలో 19,454 కొత్త పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

Telangana State Police Notification 2021 On 19,454 Posts - Sakshi

ముందు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులు తర్వాత 425 ఎస్సై

19,029 కానిస్టేబుళ్ల ఖాళీల భర్తీ   

ఏడాదిగా 8 లక్షల మంది నిరీక్షణ

కొత్త జిల్లాల ఆధారంగా భర్తీ

సాక్షి,హైదరాబాద్‌: ఏడాదిగా ఆశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ శాఖ తీపికబురు చెప్పనుంది. డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 19,454 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ ఏ క్షణంలోనైనా జారీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతకన్నా ముందు.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ)ల నియామకాలను చేపట్టనుంది. ఈ పోస్టుల భర్తీలో ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిన నేపథ్యంలో తొలుత వీటి భర్తీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పోస్టులపై ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో నేడోరేపో నోటిఫికేషన్‌  రానుంది. ఏపీపీల నియామకాల నోటిఫికేషన్‌  తర్వాత టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ నుంచి పోలీసుల భర్తీకి అధికారిక ప్రకటన వెలువడనుంది.
 
పోస్టులు ఇవే..
ఖాళీలపై పోలీసుశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం.. 425 ఎస్సై పోస్టుల్లో.. సివిల్‌లో 368, ఏఆర్‌లో 29, కమ్యూనికేషన్స్‌లో 18.. తదితర ఖాళీలున్నాయి. కానిస్టేబుళ్ల విషయానికి వస్తే.. సివిల్‌ 7,664, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌  6,783, టీఎస్‌ఎస్‌పీ 3,700, 15వ బెటాలియన్‌  562, కమ్యూనికేషన్‌  320 పోస్టులు కలుపుకొని... మొత్తంగా 19,454 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. కాగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. కేంద్రం కొత్త జోనల్‌ విధానానికి ఆమోదం తెలపడంతో కొత్త జిల్లాల ఆధారంగా ఈ పోస్టుల భర్తీ చేయనున్నట్లు సమాచారం. 

వయోపరిమితిపై ఉత్కంఠ..
2018, జూన్‌లో 18,428 పోస్టులకు నోటిఫికేషన్‌  విడుదల అయింది. అప్పుడు 6.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి దాదాపు 8 లక్షల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారుల అంచనా. ఇదే సమయంలో వయోపరిమితి  సడలింపుపైనా నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత 2 రిక్రూట్‌మెంట్లలోనూ వయోపరిమితిని ప్రభుత్వం కల్పించింది. ఈసారీ ఉంటుందా? ఉంటే.. ఎన్ని ఏళ్లు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నోటిఫికేషన్లలో జాప్యం కారణంగా ఇప్పటికే మూడు బ్యాచ్‌లు వయోపరిమితి దాటిపోయాయి. వీరందరిని సంతృప్తిపరిచేలా మినహాయింపు ఉండనుంది. 

చదవండి : అక‍్కపై దారుణం, ఎంత పనిచేశావ్‌ తమ్ముడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top