
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ.. ఆస్పత్రి బాత్‌రూమ్‌లోనే ప్రసవించింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ తన భర్త లింగయ్యతో కలిసి నాలుగు రోజుల కిందట రెండో కాన్పు కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి వచి్చంది. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రసవానికి మరో వారం రోజులు పడుతుందని చెప్పారు.
అయితే, పార్వతమ్మకు బుధవారం ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. ఆ సమయంలో ఆమె బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. నొప్పులు ఎక్కువ కావడంతో పార్వతమ్మ అక్కడే ప్రసవించింది. ఆస్పత్రి సిబ్బంది శిశువును ఐసీయూకు తరలించి తల్లీబిడ్డలకు చికిత్స అందిస్తున్నారు. నొప్పులు వచ్చిన సమయంలో సరైన విధంగా వైద్యులు స్పందించి చికిత్స చేసి ఉంటే బాత్‌రూమ్‌లో ప్రసవించేదికాదని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని పార్వతమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నార్మల్ డెలివరీ కోసం ప్రయతి్నస్తుండగా అకస్మాత్తుగా నొప్పులు రావడంతో ప్రసవించిందని వైద్యులు చెబుతున్నారు.