16 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి

Telangana: MP R Krishnaiah Demand Central Govt To Fill 16 Lakh Jobs - Sakshi

ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌  

కాచిగూడ: కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.

బీసీల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8, 9 తేదీల్లో పార్లమెంటు వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఈబీసీ సంక్షేమ సంఘం ఏపీ చైర్మన్‌ చెన్నకృష్ణారెడ్డి, కృష్ణ, వెంకటేశ్, అంజి, రాజేందర్, అనంతయ్య పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top