క్రీమీలేయర్‌ను రద్దు చేయాలి: జాజుల | Telangana: Jajula Srinivas Goud Demanded Immediate Repeal Of The Creamy Layer | Sakshi
Sakshi News home page

క్రీమీలేయర్‌ను రద్దు చేయాలి: జాజుల

Oct 9 2021 2:57 AM | Updated on Oct 9 2021 2:57 AM

Telangana: Jajula Srinivas Goud Demanded Immediate Repeal Of The Creamy Layer - Sakshi

యాదగిరిగుట్ట: బీసీలకు క్రీమీలేయర్‌ను పెట్టి వారికి రిజర్వేషన్లు అందకుండా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని వెంటనే క్రీమీలేయర్‌ను రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. బీసీ ఉపాధ్యాయులకు వెంటనే పదో న్నతులు వాటిలో రిజర్వేషన్లు కూడా కల్పించాలని కోరా రు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శుక్రవారం జరిగిన బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిల్‌లో పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 47 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా వరంగల్‌ జిల్లాకు చెందిన సురేశ్, ప్రధాన కార్యదర్శిగా యాదాద్రి జిల్లాకు చెందిన నరేంద్రస్వామి ఎన్నికయ్యారు.  

Advertisement
 
Advertisement
Advertisement