‘గురుకుల’ పోస్టులపై పిల్‌.. పార్ట్‌టైమ్‌ ట్యూటర్‌పై హైకోర్టు ఆగ్రహం

Telangana High Court Fire On Part Time Tutor Against Public Interest Litigation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలంటూ ఓ పార్ట్‌టైమ్‌ ట్యూటర్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలంటూ గత ఏప్రిల్‌లో వినతిపత్రం ఇచ్చి కనీసం నాలుగు వారాల సమయం కూడా ఇవ్వకుండా వెంటనే పిల్‌ దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది.

పార్ట్‌టైమ్‌ ట్యూటర్‌గా ఉంటూ అధ్యాపకుల నియామకాలు చేయాలని కోరుతూ పిల్‌ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. గురుకుల పోస్టులకు దరఖాస్తు చేయనంటూ అఫిడవిట్‌ సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం.మధు ఈ పిల్‌ దాఖలు చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top