ఈ గడ్డ నుంచి గర్వించదగ్గ న్యాయకోవిదులు వచ్చారు..

Supreme Court Judge Justice Venkatanarayana Bhatti called the lawyers - Sakshi

వారి వారసత్వాన్ని న్యాయవాదులు కొనసాగించాలి

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: ఈ తెలంగాణ గడ్డ నుంచి దేశం గర్వపడేలా ఎందరో న్యాయకోవిదులు వచ్చార­ని, వారి వారసత్వాన్ని కొనసాగించాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు న్యాయ­మూర్తి జస్టిస్‌ ఎస్‌.వెంకటనారాయణ భట్టి పిలుపునిచ్చారు. తనకు 30 ఏళ్లకుపైగా ఈ కోర్టుతో అనుబంధం ఉందన్నారు. అంకిత­భావంతో పనిచేస్తే న్యాయవాదులు ఉన్నత శిఖ­రాలను అధిరోహించవచ్చని చెప్పారు.

ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయ­మూర్తిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌­(హెచ్‌సీఏఏ) శుక్రవారం ఆయన్ను ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ భట్టి మాట్లా­డుతూ తన అన్న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయిన­ప్పుడు తొలిసారి ఈ కోర్టుకు వచ్చా­నని, అప్పు­డే న్యాయవాది కావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

మొదటి కోర్టు హాల్‌లో ఎక్కువగా ఉండటంతో లభించిన గుర్తింపు కూడా హైకోర్టు జడ్జి కావడానికి దోహదపడిందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, పలువురు న్యాయమూ­ర్తులతోపాటు బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, బార్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ సునీల్‌ గౌడ్, పీపీ రాజేందర్‌రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్‌రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్‌­రావు, ప్రదీప్, దేవేందర్, నాగులూరి కృష్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top