స్కిన్‌ ప్యాచ్‌తో చర్మ కేన్సర్‌కు మేలైన చికిత్స! | Skin patch treatment kills common skin cancer | Sakshi
Sakshi News home page

స్కిన్‌ ప్యాచ్‌తో చర్మ కేన్సర్‌కు మేలైన చికిత్స!

Aug 31 2026 4:35 AM | Updated on Aug 31 2026 4:35 AM

Skin patch treatment kills common skin cancer

ఓ చిన్న స్కిన్‌ ప్యాచ్‌ ద్వారా చర్మ కేన్సర్‌కు ఓ సమర్థమైన, మేలైన చికిత్సను కనుగొనే పనిలో ఉన్నారు క్వీన్స్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇందులో భాగంగా అత్యంత సన్నగా ఉండే సూదులతో కూడిన ఓ డిజాల్వబుల్‌ 3–డి ప్రింటెడ్‌ ప్యాచ్‌ను చర్మంపై కేన్సర్‌ ఉన్నచోట అతికిస్తారు. అలా అతికించిన ఈ ప్యాచ్‌ డిజాల్వబుల్‌ కావడంతో.. చర్మానికి తగిన మందును అందిస్తూ... ఈ క్రమంలో దానంతట అదే కరిగిపోయి, చర్మంలో కలిసిపోతుంది. అంతగా నొప్పి ఉండని ఈ చికిత్సలో ప్యాచ్‌పైన 5–ఫ్లోరోరేసిల్‌ అనే ఔషధంతో పాటు మన పసుపులో ఉండే ఔషధ గుణాలుండే పదార్థమైన కర్క్యుమిన్‌ కూడా ఉంటుంది.

ఈ ఔషధాలు మైక్రోనీడిల్స్‌ ద్వారా చర్మ కేన్సర్‌ తాలూకు కేన్సరస్‌ కణాలను నేరుగా టార్గెట్‌ చేస్తూ వాటిని తుదముట్టిస్తాయి. ఈ ఔషధం విజయవంతమైతే అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయి. వాటిల్లో కొన్ని... ఎక్కడ కేన్సర్‌ సమస్యఉందో అక్కడికే ఔషధాన్ని నేరుగా పంపడం, నొప్పిలేకుండా ఔషధాన్నివ్వడం, శరీరంలోకి మందులు ఇవ్వాల్సిన అవసరాన్ని తగ్గించడం, మెడికల్‌ వృథా పదార్థాలను గణనీయంగా తగ్గించగలగడం వంటి లాభాలుంటాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ ఇంకా ప్రయోగాలూ, పరిశీలన దశలోనే ఉంది. ఒకవేళ విజయవంతమైతే చర్మ కేన్సర్‌ చికిత్సలో ఇదో విప్లవాత్మకమైన మలుపు అయ్యే అవకాశముందంటున్నారు ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్న పరిశోధకులు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement