breaking news
skin patch
-
స్కిన్ ప్యాచ్‌తో చర్మ కేన్సర్‌కు మేలైన చికిత్స!
ఓ చిన్న స్కిన్ ప్యాచ్ ద్వారా చర్మ కేన్సర్‌కు ఓ సమర్థమైన, మేలైన చికిత్సను కనుగొనే పనిలో ఉన్నారు క్వీన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇందులో భాగంగా అత్యంత సన్నగా ఉండే సూదులతో కూడిన ఓ డిజాల్వబుల్ 3–డి ప్రింటెడ్ ప్యాచ్‌ను చర్మంపై కేన్సర్ ఉన్నచోట అతికిస్తారు. అలా అతికించిన ఈ ప్యాచ్ డిజాల్వబుల్ కావడంతో.. చర్మానికి తగిన మందును అందిస్తూ... ఈ క్రమంలో దానంతట అదే కరిగిపోయి, చర్మంలో కలిసిపోతుంది. అంతగా నొప్పి ఉండని ఈ చికిత్సలో ప్యాచ్పైన 5–ఫ్లోరోరేసిల్ అనే ఔషధంతో పాటు మన పసుపులో ఉండే ఔషధ గుణాలుండే పదార్థమైన కర్క్యుమిన్ కూడా ఉంటుంది.ఈ ఔషధాలు మైక్రోనీడిల్స్ ద్వారా చర్మ కేన్సర్ తాలూకు కేన్సరస్ కణాలను నేరుగా టార్గెట్ చేస్తూ వాటిని తుదముట్టిస్తాయి. ఈ ఔషధం విజయవంతమైతే అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయి. వాటిల్లో కొన్ని... ఎక్కడ కేన్సర్ సమస్యఉందో అక్కడికే ఔషధాన్ని నేరుగా పంపడం, నొప్పిలేకుండా ఔషధాన్నివ్వడం, శరీరంలోకి మందులు ఇవ్వాల్సిన అవసరాన్ని తగ్గించడం, మెడికల్ వృథా పదార్థాలను గణనీయంగా తగ్గించగలగడం వంటి లాభాలుంటాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ ఇంకా ప్రయోగాలూ, పరిశీలన దశలోనే ఉంది. ఒకవేళ విజయవంతమైతే చర్మ కేన్సర్ చికిత్సలో ఇదో విప్లవాత్మకమైన మలుపు అయ్యే అవకాశముందంటున్నారు ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్న పరిశోధకులు. -
నడుము కొవ్వును కరిగించే ప్యాచ్
న్యూయార్క్ : నడుము భాగం వద్ద కొవ్వు బాగా పెరిగి ఇబ్బంది పడుతున్నారా? మీ కోసం శాస్త్రవేత్తలు చిన్న చిన్న సూదులున్న ప్యాచ్‌ను రూపొందించారు. కొవ్వును కరిగించే ఈ ప్యాచ్ ఊబకాయం, మధుమేహం లాంటి జీవక్రియ సంబంధ రుగ్మతలకు చికిత్స అందించేందుకు కూడా ఉపకరిస్తుందట. తెల్లని కొవ్వు (మోతాదుకు మించి ఉండేది) ను ఇది గోధుమ రంగులోకి మార్చుతుందని అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్శిటీ మెడికల్ సెంటర్, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధకులు తెలిపారు.


