గోదావరిఖని.. ఇక పర్యాటక గని!

Singareni Authorities Giving New Look To Closed GDK LEP Mine - Sakshi

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పర్యాటక శోభను సంతరించుకుంటోంది. మూతపడిన జీడీకే 7 ఎల్‌ఈపీ గనికి సింగరేణి అధికారులు కొత్తరూపు ఇస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు సింగరేణి టూరిజం ప్యాకేజీని టీఎస్‌ ఆర్టీసీ ప్రవేశపెట్టడంతో ఈ నెల 27 నుంచే పర్యాటకులు ఇక్కడకు రానున్నట్లు తెలుస్తోంది.

సింగరేణి డైరెక్టర్‌(పా) చంద్రశేఖర్‌ మూడు ఏరియా జీఎంలు కె.నారాయణ, ఎ.మనోహర్, టి.వెంకటేశ్వర్‌రావుతో కలిసి 7 ఎల్‌ఈïపీ గనిని సందర్శించారు. సంస్థ సీఎండీ శ్రీధర్‌ ఆదేశాల మేరకు పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి బొగ్గు గనులు అంటే అందరికీ తెలిసినప్పటికీ భూగర్భ గనిలోకి కార్మికులు ఎలా వెళ్తారు..? ఉత్పత్తి ఎలా తీస్తారు..? రక్షణ చర్యలు ఎలా ఉంటాయి..? ఇలా అనేక సందేహాలను పర్యాటకులకు నివృత్తి చేసేలా సింగరేణి చర్యలు తీసుకుంటోంది.

దేశంలోనే మొదటిసారిగా సింగరేణి సహకారంతో ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ సిద్ధం చేస్తోంది. ఇటీవల రామగుండంకు వచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆర్జీ–2 ఏరియాలోని వకీల్‌పల్లి గనిని కుటుంబసభ్యులతో సందర్శించారు. బొగ్గు గనులు, ఇక్కడి ప్రాజెక్టులతో కలిపి ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ చేస్తే బాగుంటుందని ప్రకటించిన ఆయన ప్యాకేజీకి సహకరించాలని సింగరేణికి లేఖ రాశారు. సింగరేణి బొగ్గు గని, ఓసీపీ, పవర్‌ ప్లాంట్‌తోపాటు రాబోయే రోజుల్లో పార్వతీ బ్యారేజీ, కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పర్యాటకస్థలాలను పొందుపర్చనున్నట్లు చెప్పారు. ఈ మేరకు సీఎండీ శ్రీధర్‌కు లేఖ రాయడంతో టూరిజం ప్యాకేజీ పనుల్లో వేగం పెరిగింది.

టూర్‌ ఇలా.. 
హైదరాబాద్‌ నుంచి బయల్దేరే టూరిస్టులు మార్గమధ్యంలో లోయర్‌ మానేర్‌ డ్యాం సందర్శిస్తారు.  ళీ అక్కడి నుంచి జీడీకే–7 ఎల్‌ఈపీ గనికి చేరుకుంటారు. అక్కడ సింగరేణి ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్‌ ద్వారా సంస్థ పనితీరు, బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమం, రక్షణ చర్యల గురించి వివరిస్తారు.  ళీ    ఇందుకు యైటింక్లయిన్‌ కాలనీలోని మెయిన్‌ రెస్క్యూ స్టేషన్‌కు పర్యాటకులను తీసుకెళ్తారు. ళీ అక్కడ భోజనాలు ముగిసిన తర్వాత ఓసీపీ–3 వ్యూపాయింట్‌ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ఓసీపీ–3లో జరిగే బ్లాస్టింగ్‌ చూపిస్తారు.  ళీ అక్కడి నుంచి సింగరేణి థర్మల్‌ ప్లాంట్‌కు తీసుకెళ్లి విద్యుదుత్పత్తి తీరును వివరిస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top