
సాక్షి, హైదరాబాద్: విభిన్న ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు రూపొందించిన దుస్తులతో సిల్క్ ఇండియా వస్త్ర ప్రదర్శన మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటైంది. వివాహ ప్రత్యేక దుస్తుల శ్రేణిని నేపథ్యంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది.
ప్రదర్శనలో ఉప్పాడ, బనారస్ సిల్క్స్, గద్వాల, ధర్మవరం తదితర ప్రసిద్ధి వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. చేనేత కళాకారులు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణ వేత్తలు, డిజైనర్లు తదితరుల బృందంతో ఏర్పాటైన ఒడిస్సా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శన ఈ నెల 9 వరకు కొనసాగుతుందని వివరించారు.