మరో ఏడు లింక్‌ రోడ్లు: రూ.203 కోట్లు.. 25 కి.మీ 

Seven More Link Roads In Greater Under Auspices Of HRDCL - Sakshi

సాక్షి,హైదరాబాద్‌:  హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌న్‌ లిమిటెడ్‌(హెచ్‌ఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో గ్రేటర్‌ శివార్లలో మరో ఏడు లింక్‌రోడ్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. నగరంలో తొలి రెండు దశల్లో నిర్మించిన లింక్‌రోడ్లతో ఎంతో ప్రయోజనం కలగడంతో మూడో దశలో జీహెచ్‌ఎంసీతో పాటు శివార్లలోని 10 స్థానిక సంస్థల్లోనూ లింక్‌రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది.

వాటికి నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేయడంతో పాటు ఇటీవల మూడో దశలోని మూడో ప్యాకేజీ పనులకు టెండర్లు పిలవడం తెలిసిందే. తాజాగా ఈ దశలోని మొదటి ప్యాకేజీ పనులకు టెండర్లు పిలిచినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిన 50 కారిడార్లలో ఈ ఏడు రోడ్లు  కూడా ఉండటంతో వీటికి టెండర్లు పిలిచారు. టెండర్లు పూర్తికాగానే పనులు చేపట్టనున్నారు. వీటి అంచనా వ్యయం రూ.203.34 కోట్లు. రెండు ప్యాకేజీల్లోని పనులను పరిగణనలోకి తీసుకుంటే వాటికయ్యే మొత్తం వ్యయం దాదాపు రూ. 500 కోట్లు.  

తాజాగా టెండర్లు పిలిచిన ఏడు మార్గాలు.. నిర్మించనున్న  లింక్‌రోడ్ల పొడవు వివరాలిలా ఉన్నాయి.  
1.ఈసా నది తూర్పు వైపు బాపూఘాట్‌ బ్రిడ్జినుంచి పీఅండ్‌టీ కాలనీ: (2.10 కి.మీ) 
2.కొత్తూరులో రైల్వేక్రాసింగ్‌ నుంచి కుమ్మరిగూడ జంక్షన్‌: (2.60 కి.మీ.) 
3.కొత్తూరు వై జంక్షన్‌ నుంచి వినాయక స్టీల్‌ (ఎన్‌న్‌హెచ్‌44) వరకు:(1.50కి.మీ)  
4.శంషాబాద్‌ ఎన్‌హెచ్‌ 44 బస్టాప్‌ నుంచి ఒయాసిస్‌ ఇంటర్నేషనల్‌:(4కి.మీ) 
5.శంషాబాద్‌ రైల్వే క్రాసింగ్‌ నుంచి ధర్మగిరి రోడ్‌: (5కి.మీ) 
6. ఎన్‌న్‌హెచ్‌ తొండుపల్లి జంక్షన్‌   నుంచి  ఓఆర్‌ఆర్‌ సరీ్వస్‌రోడ్‌:(3కి.మీ) 
7.గొల్లపల్లి ఎన్‌హెచ్‌ జంక్షన్‌– ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్‌ (7 కి.మీ)  
ఏడు మార్గాల్లో వెరసి మొత్తం   25.20 కి.మీ.ల లింక్‌రోడ్డు నిర్మించనున్నారు.  

(చదవండి: రాష్ట్రాలకు ఆ అధికారం లేదు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top