నల్లగొండ టూటౌన్: సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ (సీమ) ఆధ్వర్యంలో డిసెంబర్ 6న బెంగళూరులో నిర్వహించనున్న సీమ ఉత్తమ ఫొటో జర్నలిస్ట్ అవార్డు–2025కు నల్లగొండ జిల్లా సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్ కంది భజరంగ్ ప్రసాద్ ఎంపికైనట్లు సీమ జనరల్ సెక్రటరీ ఎన్.కె. స్వామి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మీడియాలో సేవలు అందించినందకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అవార్డును కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి మంత్రులు అందజేయనున్నట్లు వివరించారు.


