
సంగారెడ్డి: జిల్లాలోని కంకోల్ వోక్సెన్ యూనివర్శిటీలో విషాదం చోటు చేసుకుంది. క్యాంపస్ రూమ్‌లో ఓ విద్యార్థి ఫ్యాన్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రుశికేష్(19) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు రుశికేష్,. ఆర్కిటెక్చర్ సెకండ ఇయర్ చదువుతున్న రుషికేష్ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలోనే రుషికేష్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రుషికేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మొబైల్‌లో తీసుకున్న సెల్ఫీ వీడియోను బట్టి తెలిసే అవకాశం ఉంది. రుశికేష్ స్వస్థలం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌గా గుర్తించారు.