మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం

Second day IT Raids at TRS Minister Mallareddy House in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు నిర్వహిస్తున్న దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్‌, మెడికల్‌, ఫార్మా కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.

మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే, మంత్రి ఇంట్లో ఉండగానే.. కేంద్ర పోలీసు బలగాల పహారాలో ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి. మొత్తం 50 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించిన అధికారులు, రూ.8.8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్‌ సీట్ల కేటాయింపుల్లో అవకతవకలు, రియల్‌ ఎస్టేట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు  గుర్తించినట్లు సమాచారం.

చదవండి: (టార్గెట్‌ మల్లారెడ్డి.. మంత్రి ఆస్తులు లక్ష్యంగా ఐటీ దాడులు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top