సభ్యత్వం చేయకపోతే పదవులు రావు 

Rewanth Reddy Serious On Party Digital Membership In Telangana - Sakshi

సభ్యత్వ నమోదుపై అధిష్టానం సీరియస్‌గా ఉంది

డిజిటల్‌ సభ్యత్వ నమోదు సమీక్షలో రేవంత్‌రెడ్డి 

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతానికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని, సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా పనిచేయనివారికి పార్టీలో  భవిష్యత్‌ ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అలాంటి వారికి పదవులు రావడం కష్టమన్నారు. సభ్యత్వ నమోదును ఏఐసీసీ చాలా సీరియస్‌గా పరిగణిస్తోందని, రోజూ ఢిల్లీస్థాయిలో సమీక్షిస్తోందని చెప్పారు. పార్టీ నేతలు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, సమన్వయకర్తలు, బూత్‌స్థాయి ఎన్‌రోలర్లు సమష్టిగా పనిచేసి 30 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు.

ఆదివారం ఆయన గాం«దీభవన్‌లో డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. పార్టీ బలోపేతానికి, రానున్న ఎన్నికల్లో గెలుపునకు సభ్యత్వాలు చాలా కీలకమని, ప్రతి పోలింగ్‌ బూత్‌లో కనీసం 100 మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలని చెప్పారు. ఫిబ్రవరి 9న మళ్లీ దీనిపై సమీక్షించనున్నారు.

11 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌ యాదవ్, డిజిటల్‌ సభ్యత్వ నమోదు రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.  

ఉద్యోగ నోటిఫికేషన్లు అడిగితే దాడులా? 
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతిని మూడేళ్లయినా అమలుపర్చలేదని, ఈ విషయాలను అడిగేందుకు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడికి వెళ్లిన యూత్‌ కాంగ్రెస్‌ నేతలపై టీఆర్‌ఎస్‌ నేతలు దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇబ్రహీంపట్నంలో యూత్‌ కాంగ్రెస్‌ నేత రవికాంత్‌గౌడ్‌పై ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అనుచరులు దాడి చేశారని, జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడిలో పోలీసుల అత్యుత్సాహం కారణంగా కార్యకర్త శ్రీనివాస్‌ నాయక్‌ కాలు విరిగిందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

ఉద్యమం ఉధృతం చేస్తాం: శివసేనారెడ్డి 
ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడిలో భాగంగా వినతిపత్రాలు సమరి్పంచేందుకు వెళ్లిన యువజన కాంగ్రెస్‌ నేతలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్‌ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఎమ్మెల్యేలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.  

దేశంలోనే నంబర్‌ 1 నల్లగొండ 
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్టీ సభ్యత్వ నమోదులో నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని గాం«దీభవన్‌ వర్గాలు చెప్పాయి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో 3.50 లక్షల సభ్యత్వం నమోదైందన్నాయి. దీని పరిధిలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 76,252, సూర్యాపేటలో 73,697, కోదాడలో 55,682, మిర్యాలగూడలో 38,456, దేవరకొండలో 38,380, నాగార్జునసాగర్‌లో 57,260, నల్లగొండలో 8,711 సభ్యత్వాలను ఈ నెల 29 నాటికి పూర్తి చేసినట్టు చెప్పాయి. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీస్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top