హైదరాబాద్‌కు ఆ పరిస్థితి రావద్దనే ఇలా చేస్తు‍న్నాం: రేవంత్‌ రెడ్డి | Revanth Reddy Credits Congress Leadership For His Rise, Outlines Development Plans In Hyderabad, Check Out More Details | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు ఆ పరిస్థితి రావద్దనే ఇలా చేస్తు‍న్నాం: రేవంత్‌ రెడ్డి

Jun 18 2026 9:21 PM | Updated on Jun 19 2026 12:20 PM

Revanth Reddy Credits Congress Leadership for CM Role

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఆశీర్వదిస్తేనే తాను సీఎం అయ్యానని రేవంత్‌ రెడ్డి అన్నారు. సీఎంగా ఎల్బీనగర్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. తనకు తన సొంతూరు కొండారెడ్డిపల్లెలాగే ఎల్బీనగర్‌ అని చెప్పారు. ఎల్‌బీ నగర్‌ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అంటే నాకు ప్ర‌త్యేక అభిమానం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో పార్క్‌ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.

హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘కాలుష్య కోరల్లో ఢిల్లీ చిక్కుకుంది. హైదరాబాద్‌కు ఆ పరిస్థితి రావద్దనే మొక్కల పెంపకం చేపట్టాం. మూసీ పునరుజ్జీవం చేస్తామంటే అడ‍్డుపడుతున్నారు. భూకబ్జాలతో ప్రజలకు సమస్యలు రావద్దనే హైడ్రాను తీసుకొచ్చాం. 

పేదల జోలికి హైడ‍్రా వెళ్లదు, కబ‍్జాదారుల భరతం పడుతుంది. 2018 శాస‌నస‌భ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ కుట్ర వ‌ల్ల కొడంగ‌ల్‌లో ఓడిపోయిన‌ప్పుడు చాలా మంది ఇక ఏమీకాడ‌ని న‌వ్వుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ‌గా నిల‌బ‌డి మ‌ల్కాజ్ గిరి ఎంపీగా నాకు అవ‌కాశం ఇచ్చారు. ఆ నాడు ఎంపీగా పోటీ చేసిన‌ప్పుడు ఎల్‌బీ న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో 30 వేల మెజార్టీ ఇచ్చి ప్ర‌శ్నించే గొంతును నిల‌బెట్టారు. 

పార్ల‌మెంటులో పార్టీ, ప్ర‌జ‌ల త‌రుపున గ‌ట్టిగా నిల‌బ‌డి కొట్లాడిన‌ప్పుడు సోనియా, రాహుల్ గాంధీ న‌న్ను గుర్తించి పీసీసీ అధ్య‌క్షుడిగా అవ‌కాశం ఇచ్చారు.ఈ ప్రాంతంలో రూ.2.400 కోట్ల‌తో 240 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ను నిర్మిస్తున్నాం’’ అని తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement