శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి | Revanth reddy comments in tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

Nov 12 2023 9:51 AM | Updated on Nov 23 2023 12:11 PM

Revanth reddy comments in tirumala - Sakshi

సాక్షి, తిరుమల: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని  టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. జోరు మీదున్న తెలంగాణ ఎన్నికల ప్రచారానికి పండుగ బ్రేక్‌ రావడంతో ఆయన తిరుమల వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆంధ్ర, తెలంగాణ మధ్య  మానవ, ఆర్ధిక, రాజకీయ సంబంధాలు ఉండాలని స్వామి వారిని‌ ప్రార్ధించినట్లు తెలిపారు.

‘రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం కావాలని స్వామి వారిని కోరుకున్నా. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి కట్టుగా ఉండాలని ప్రార్ధించా. రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి‌ రోజులు వస్తాయని భావిస్తున్నా’ అని రేవంత్‌ అన్నారు. కాగా,రేవంత్‌రెడ్డి శనివారం రామగుండం, బెల్లంపల్లి, ధర్మపురి కాంగ్రెస్‌ విజయభేరి సభల్లో పాల్గొని సుడిగాలి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement