హైదరాబాద్‌కు కాంగ్రెస్‌ ప్రముఖులు

Randeep Singh Surjewala Arrived In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్‌ కమిటీ సభ్యుడు రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డి.కె.శివకుమార్, ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా విడిగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాయచూర్‌లో జరిగే ఓ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి వెళ్తూ ఈ ముగ్గురు మార్గమధ్యలో హైదరాబాద్‌లో బసచేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, కర్ణాటక కాంగ్రెస్‌ సహ ఇన్‌చార్జి మధుయాష్కీగౌడ్‌ నివాసానికి వెళ్లిన వీరు కొంతసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని రాయచూర్‌కు వెళ్లారు. వీరిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top