ఉద్రిక్తతల మధ్య పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ | Ramagundam Villagers Protesting Against Singareni Management | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తతల మధ్య పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ

Nov 5 2022 2:36 AM | Updated on Nov 5 2022 2:36 AM

Ramagundam Villagers Protesting Against Singareni Management - Sakshi

న్యాయం చేయాలంటూ నిరసన తెలుపుతున్న నిర్వాసిత గ్రామ ప్రజలు  

గోదావరిఖని: ఉద్రిక్తతల మధ్య పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగింది. సింగరేణి సంస్థ రామగుండం డివిజన్‌–1 పరిధిలో పర్యావరణ ఉల్లంఘన కింద మూసివేసిన మేడిపల్లి ఓసీపీ శుక్రవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ దీపక్‌కుమార్, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు రీజినల్‌ ఇంజనీర్‌ భిక్షపతి ఆధ్వర్యంలో సభ కొనసాగింది.

ప్రభావిత గ్రామాలైన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని లింగాపూర్, మేడిపల్లి, పాములపేట, రామగుండం గ్రామాలకు చెందిన ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. సింగరేణి యాజమాన్యం ప్రభావిత గ్రామాలపై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ ఆధ్వర్యంలో రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, వన్‌టౌన్‌ రెండో సీఐ ప్రసాద్‌రావు, మంథని సీఐ సతీశ్‌తో బలగాలు మోహరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement