హైదరాబాద్‌: పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వాన | rainfall in various areas hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వాన

Published Sat, Jun 8 2024 3:31 PM | Last Updated on Sat, Jun 8 2024 5:06 PM

rainfall in various areas hyderabad

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారి మేఘాలు కమ్ముకొని.. పలు చోట్ల వాన కురిసింది. కోఠి, సెక్రటేరియట్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.  

బలహీన పడిన ఉపరీతల ఆవర్థనం 
ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నిజామాబాద్ వరకు  నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మరో 2, 3 రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించనున్నాయని హైదారబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరీతల ఆవర్థనం బలహీన పడిందని పేర్కొంది. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షం పడనున్నట్లు సూచించింది. 

వికారాబాద్‌, మహబూబ్ నగర్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది.  సాయంత్రం హైదరాబాద్‌కి ఉరుములు మెరుపులతో పాటు  గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన  తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉ‍న్నట్లు చెప్పింది. దక్షిణ ఈశాన్య, మధ్య తెలంగాణ జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల పడతాయని పేర్కొంది.
హైదరాబాద్ లో భారీ వర్షం 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement