రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర: ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా | Rahul Bharat Jodo Yatra Traffic Restrictions Imposed | Sakshi
Sakshi News home page

రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర: ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

Oct 23 2022 9:50 AM | Updated on Oct 23 2022 12:35 PM

Rahul Bharat Jodo Yatra Traffic Restrictions Imposed - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఆది­వారం ఉదయం కర్ణాటక నుంచి తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు ప్రవేశించనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అటు హైదరాబాద్‌ నుంచి మక్తల్‌ మీదుగా రాయ­చూర్‌కు.. ఇటు దేవరకద్ర, మరికల్‌ నుంచి మక్తల్‌ గుండా రాయచూర్‌కు వెళ్లే వాహనాలను దారి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవా­రుజామున 4 గంటల నుంచి ఈ ఆంక్షలు అ­మల్లోకి రానున్నాయి. 

డైవర్షన్‌ ఇలా..
హైదరాబాద్‌ నుంచి మక్తల్‌ మీదుగా రాయచూర్‌కు వెళ్లే వాహనాలను గద్వాల్‌ మీదుగా డైవర్షన్‌ చేయనున్నారు. జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్‌నగర్‌ వన్‌ టౌన్‌ వద్ద ట్రాఫిక్‌ డైవర్షన్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. దేవరకద్ర, మరికల్‌ నుంచి మక్తల్, రాయచూర్‌కి వెళ్లే వాహనాలను, అమరచింత, జూరాల, ధరూర్, కేటిదొడ్డి మీదుగా దారి మళ్లించనున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement