
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా 2017 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారిణి డాక్టర్ పూజిత బాధ్యతలు స్వీకరించారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం కేబీఆర్ పురం. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన పూజిత.. ఏడాది పాటు రుయా ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా సేవలు అందించారు.
సివిల్స్‌లో 282 ర్యాంక్ సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. పూజిత భర్త మోహన్‌కృష్ణ భారత వాయుసేనలో స్క్వాడ్రన్ లీడర్‌గా పని చేస్తున్నారు. పూజిత ప్రతిభా పాటవాలు తెలుసుకున్న బండి సంజయ్ మహిళా అభ్యున్నతి, మహిళల భద్రతా అంశాల్లో సేవలు వినియోగించుకోవడానికి ఎంపిక చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment