జ్ఞాపకశక్తిపైనా.. కరోనా పంజా

Psychologist Says Corona Affects Human Memory Power - Sakshi

బాగా గుర్తున్న వాటిలో ఏదో ఒకటి జ్ఞాపకం ఉండట్లేదన్న 80 శాతం మంది

ఏదైనా విషయం లేదా జరిగిన ఘటనను మరిచిపోతున్నామన్న 55 శాతం మంది

మహిళలపై మరింత ప్రభావం పడినట్టు వెల్లడి

బ్రిటిష్‌ మెమొరీ పరిశోధకురాలు కేథరీన్‌ అధ్యయనంలో వెలుగులోకి..

కోవిడ్‌ మహమ్మారి జ్ఞాపకశక్తి పైనా పంజా విసురుతోంది. దాదాపు ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి మనుషుల జీవన విధానాన్ని ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో ప్రభావితం చేస్తూనే ఉంది. మహమ్మారి కారణంగా తలెత్తిన పరిణామాలు, మార్పులతో ఊహ తెలిశాక రోజువారీ జీవన విధానంలో కొన్నేళ్లుగా పాటిస్తున్న ఒక ‘టైం టేబుల్‌’కు భిన్నంగా వ్యవహరించాల్సి రావడం, కొత్త లక్షణాలు, భయాలతో వచ్చిన అంతుచిక్కని వ్యాధి మస్తిష్కాలను, ఆలోచనలను మార్చివేసింది. కోవిడ్‌ వస్తుందేమోనన్న భయాలు, ఆందోళనలు మెదళ్లను, ఆలోచన తీరును ఎంతగానో ప్రభావితం చేసినట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్లతో బంధువులు, మిత్రులు, సహోద్యోగులు, తదితరులను ప్రత్యక్షంగా కలుసుకోలేకపోవడంతో మనుషుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతినడం వంటివి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం  చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.– సాక్షి, హైదరాబాద్‌

ఇదీ అధ్యయనం...
సంఘ జీవిగా ఉన్న మనిషి తన సహజ ప్రవృత్తికి భిన్నంగా సామాజిక సంబంధాలను కొనసాగించలేకపోవడం మెదడుపై, ఆలోచనల తీరు, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతున్నట్టు వెస్ట్‌మినిస్టర్‌ యూనివర్సిటీ కాగ్నిటివ్‌ న్యూరోసైన్స్‌ ప్రొ.కేథరీన్‌ లవ్‌ డే నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కేథరీన్‌ తన పరిశోధనలో.. ఎవరికైనా ఏదైనా చెబుదామనుకుని మరిచిపోయారా?, చదివిన పుస్తకాన్నే మళ్లీ చదువుతున్నారా? వంటి అంశాలతో ‘ప్రతిరోజు జ్ఞాపకశక్తి ప్రశ్నావళి’ ద్వారా వివిధ విషయాలపై పలువురి నుంచి సమాధానాలు రాబట్టారు. తాము బాగా గుర్తుంచుకున్న విషయాల్లో ఏదో ఒక భాగాన్ని మరిచిపోతున్నట్టు ఈ అధ్యయనంలో పాల్గొన్న 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏదో ఒక ఘటన లేదా చేయాల్సిన పనిని మరిచిపోతున్నట్లు 55 శాతం మంది వెల్లడించారు.

మహమ్మారి కారణంగా తలెత్తిన పరిణామాలతో మెదడు పనితీరు, ఆలోచనలు కూడా ఏదో ఒకరూపంలో ప్రభావితమైనట్లు 30 శాతం మంది పేర్కొన్నారు. కోవిడ్‌ పరిస్థితుల ప్రభావం మహిళలపై మరింత ఎక్కువగా పడినట్లు, పురుషులతో పోల్చితే వారి జ్ఞాపకశక్తి ఎక్కువ తగ్గినట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. కాగా, కోవిడ్‌ మహమ్మారి  మనుషుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని సైకాలజిస్ట్‌ విశేష్‌ పేర్కొన్నారు. ఆప్తులతో మనసారా మాట్లాడలేకపోవడం, అభిప్రాయాలు, ఆలోచనల మార్పిడి లేకపోవడంతో వ్యక్తిత్వం, జ్ఞాపక శక్తి, చురుకుదనం పెంచుకునే అవకాశాలు లేకుండా పోయాయని అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావం మనుషుల   మానసిక, శారీరక ఆరోగ్యాలపై సుదీర్ఘకాలం పాటు ఉంటుందని వివరించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-06-2021
Jun 25, 2021, 11:30 IST
సురీ: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భమ్‌ జిల్లాలో గురువారం దాదాపు 150 మంది బీజేపీ కార్యకర్తలు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ)లో...
25-06-2021
Jun 25, 2021, 11:00 IST
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కోవిడ్‌–19 టీకా కేటాయింపులో వివక్ష కొనసాగుతోందంటూ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. జనాభా, కేసుల తీవ్రత,...
25-06-2021
Jun 25, 2021, 08:59 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితుల మానసిక ఆరోగ్యంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు సంబంధించి ఇప్పటికే...
25-06-2021
Jun 25, 2021, 08:41 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం విజయవంతమయ్యేలా కాంగ్రెస్‌ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించాలని, అందుకు తమ పార్టీ...
25-06-2021
Jun 25, 2021, 07:57 IST
సాక్షి, హైదరాబాద్‌: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి కరోనా కాటుకు బలి అయితే, ఆ కుటుంబ సభ్యులు వీధిన పడకుండా...
25-06-2021
Jun 25, 2021, 03:53 IST
తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మిమి చక్రవర్తిని కూడా కేటుగాళ్లు మాయ చేశారు.
25-06-2021
Jun 25, 2021, 03:15 IST
ఐరాస: ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తున్న కరోనా డెల్టా వేరియంట్‌ను 85 దేశాల్లో గుర్తించారని గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...
25-06-2021
Jun 25, 2021, 01:51 IST
►మన దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయి. మహా రాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఈ...
24-06-2021
Jun 24, 2021, 13:16 IST
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురైంది. కోవాగ్జిన్‌కు పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డీసీజీఐ అంగీకరించలేదు. మరింత క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా...
24-06-2021
Jun 24, 2021, 10:20 IST
భోపాల్‌: కరోనా మహమ్మారి రోజురోజుకు రూపం మార్చుకుంటూ మరింత శక్తివంతంగా తయారవతుంది. తాజాగా డెల్టా వేరియంట్‌ వ్యాప్తి ప్రారంభమయ్యింది. ఇది...
24-06-2021
Jun 24, 2021, 10:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 54,069  కరోనా పాజిటివ్‌...
24-06-2021
Jun 24, 2021, 07:45 IST
న్యూఢిల్లీ: వ్యాక్సిన్‌ విధానంపై బుధవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో హైడ్రామా చోటు చేసుకుంది. వ్యాక్సిన్‌ విధానంపై చర్చించడానికి ఇది...
24-06-2021
Jun 24, 2021, 05:44 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ మరో మైలరాయి దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి...
24-06-2021
Jun 24, 2021, 02:06 IST
ఒళ్లు కదల్చని బద్దకం... వేళపాళ లేని తిండి..  కంటికి కరవైన కునుకు... ఆధునిక జీవనశైలి తాలూకూ మూడు ప్రధాన లక్షణాలివి. ఈ...
24-06-2021
Jun 24, 2021, 01:22 IST
న్యూఢిల్లీ: ప్రజలు సరైన జాగ్రత్తలు పాటిస్తే కరోనా మూడో వేవ్‌ ప్రభావం పెద్దగా ఉండబోదని ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌...
24-06-2021
Jun 24, 2021, 00:40 IST
సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ఎత్తేశారు... కరోనాతో ఎలాంటి ప్రమాదం లేదని అనుకోవడం ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు తేల్చిచెబుతున్నారు....
23-06-2021
Jun 23, 2021, 18:15 IST
సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టినందుకుగాను మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై...
23-06-2021
Jun 23, 2021, 17:03 IST
న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ చిన్నపిల్లలపై అధిక ప్రభావం చూపనుందని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో పుణెలోని బీజే మెడిక‌ల్ కాలేజీ పరిశోధకులు...
23-06-2021
Jun 23, 2021, 12:34 IST
అమరావతి: ఏపీ సచివాలయంలో ఉద్యోగులకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేతుల మీదుగా బుధవారం ఆనందయ్య మందు పంపిణీ...
23-06-2021
Jun 23, 2021, 12:03 IST
బెర్లిన్‌: రెండు వేర్వేరు కరోనా టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. నిపుణులు మాత్రం ఇలా రెండు వేర్వేరు టీకాలను తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top