రన్నింగ్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం | Nalgonda District: Private Bus Caught Fire At Narketpally - Sakshi
Sakshi News home page

రన్నింగ్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం

Sep 8 2023 7:43 AM | Updated on Sep 8 2023 10:16 AM

Private Bus Caught Fire At Narketpally Nalgonda District - Sakshi

తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

సాక్షి, నల్గొండ జిల్లా: తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. నార్కెట్‌పల్లి అద్దంకి రహదారిపై కృష్ణాపురం వద్ద ఘటన జరిగింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులోని 26 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదానికి గురైన బస్సు వేమూరి-కావేరి ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి నెల్లూరు వెళ్తుండగా బస్సు వెనుక టైర్ పేలడంతో రాపిడికి గురవడంతో ఘటన జరిగింది.
చదవండి: గందరగోళంగా వాతావరణం.. తెలుగు రాష్ట్రాలకు కొనసాగనున్న వర్షాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement