సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న ముర్ము | President Murmu Visits Puttaparthi Updates | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తి పర్యటన.. అప్‌డేట్స్‌

Nov 22 2025 9:23 AM | Updated on Nov 22 2025 11:53 AM

President Murmu Visits Puttaparthi Updates

ద్రౌపది ముర్ము పుట్టపర్తి పర్యటన అప్‌డేట్స్‌..

సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న ముర్ము

  • పుట్టపర్తి:
  • పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
  • సాయి కుల్వంత్‌ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న ముర్ము. 

పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము..

  • శ్రీ సత్య సాయి జిల్లా..
  • పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, కలెక్టర్ శ్యాంప్రసాద్, ప్రజా ప్రతినిధులు.

తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన 

  • పుట్టపర్తికి బయలు దేరిన రాష్ట్రపతి
  • బేగంపేట విమానశ్రయానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
  • మరికాసేపట్లో పుట్టపర్తికి ద్రౌపదీ ముర్ము
  • బేగంపేట్ నుంచి పుట్టపర్తికి బయలు దేరిన రాష్ట్రపతి
  • రాష్ట్రపతితోపాటు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం
  • హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, మేయర్ గద్వాల విజయలక్ష్మి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు పుట్టపర్తిని సందర్శించనున్నారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. అనంతరం, శ్రీ సత్యసాయి సమాధిని దర్శించుకోనున్నారు. తర్వాత యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు.

ఇక, రాష్ట్రపతి ముర్ము శుక్రవారం హైదరాబాద్‌ చేరుకుని ఇక్కడ బస చేశారు. కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరి పుట్టపర్తికి వెళ్లనున్నారు. పుట్టపర్తిలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి పుట్టపర్తి వస్తుండటంతో భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో రాష్ట్రపతికి సీఎం రేవంత్‌ రెడ్డి వీడ్కోలు పలకనున్నారు. 

	Puttaparthi: సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement