12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు

Potti Sreeramulu Telugu University Prathibha Puraskaram 2018 Names Announced - Sakshi

నాంపల్లి (హైదరాబాద్‌): వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ 2018 ఏడాదికి  ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది.

రామకవచం వెంకటేశ్వర్లు (కవిత), ఆచార్య వెలుదండ నిత్యానందరావు (విమర్శ), డి.అనంతయ్య (చిత్రలేఖనం), ఆర్‌.గంగాధర్‌ (శిల్పం), ఓలేటి రంగమణి (నృత్యం), డాక్టర్‌ ఎస్‌.కె.వెంకటాచార్యులు (సంగీతం), కల్లూరి భాస్కరం (పత్రికారంగం), రావుల వెంకట్రాజం గౌడ్‌ (నాటకం), కౌళ్ళ తలారి బాలయ్య (జానపద కళారంగం), డాక్టర్‌ మలుగ అంజయ్య (అవధానం), ఎన్‌.అరుణ (ఉత్తమ రచయిత్రి), పి.చంద్రశేఖర ఆజాద్‌ (నవల) పురస్కారాలకు ఎంపికయ్యారు. (చదవండి: జోనల్‌ సర్దుబాటు తర్వాత కొత్త ఉద్యోగాలు)

డిసెంబరులో హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌ తెలిపారు. (చదవండి: ఉద్యోగుల కేటాయింపులో ఆప్షన్లు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top