హైదరాబాద్‌: మేడిపల్లిలో దారుణం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: మేడిపల్లిలో దారుణం

Published Wed, May 22 2024 4:26 PM

Police Arrest Child selling Gang Medipally In Hyderabad

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మేడిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నెలల చిన్నారిని ఓ దుర్మార్గుల ముఠా అమ్మకానికి పెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. చిన్నారిని అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. 

పీర్జాదిగుడా కార్పొరేషన్ రామకృష్ణ నగర్‌లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ ఈ ఘటన జరిగింది. సుమారు నాలుగు లక్షలకు చిన్నారిని ఇప్పిస్తామని డాక్టర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటగా పదివేలు అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement