NGRI Hyderabad: ఆ గనుల్లో బంగారం కంటే విలువైన లోహం

Platinum reserves in Hatti gold mines Karnataka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలోని హట్టి బంగారు గనుల్లో..బంగారం కంటే విలువైన లోహం ప్లాటినం కూడా దొరికే అవకాశముందని హైదరాబాద్‌ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) గుర్తించింది. ఆరేళ్ల పరిశోధనల అనంతరం ప్లాటినం నిల్వలను కనుగొన్నట్లు ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త డాక్టర్‌ పీవీ సురేందర్‌ రాజు ‘సాక్షి’కి వెల్లడించారు. హట్టి బంగారు గనుల్లో ఇతర విలువైన లోహాలు ఏమైనా లభిస్తాయా అన్న కుతూహలంతో తాము పరిశోధనలు చేపట్టామని, ఈ క్రమంలో అక్కడ క్వార్ట్జ్‌ ఉన్నట్లు తెలిసిందన్నారు.

క్వార్ట్జ్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అంగారక యాత్రకు వాడిన ప్రత్యేకమైన ఎస్‌ రే యంత్రాన్ని  ఉపయోగించి విశ్లేషించినప్పుడు అందులో ప్లాటినం ఉన్నట్లు గుర్తించామని వివరించారు. బంగారం కంటే విలువైన ప్లాటినం లోహాన్ని కంప్యూటర్ల తయారీతో పాటు రసాయన చర్యల వేగాన్ని పెంచే ఉ్రత్పేరకంగాను వాడతారన్నది తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్లాటినం నిల్వలు ఉన్నాయని... ఒడిశాలోని బౌల–సుసహి,  సితంపుండి తమిళనాడు, హనుమాన్‌పూర్‌ హట్టి గనుల్లో కూడా గతంలో లభ్యమైనట్లు తెలిపారు. క్రోమియం ఉన్న ప్రతి చోట ప్లాటినంను గుర్తించినట్లు తెలిపారు.  

పరిశోధనశాలలు అవసరం 
దేశంలో ఖనిజాల ఉనికినిని గుర్తించేందుకు ప్రత్యేకమై న పరిశోధనశాలలు అవసరం అని ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలో వీటిని ఏర్పాటు చేయాలని, విద్యార్థులను భాగస్వాములను చేయాలని డా. సుందర్‌ రాజు అభిప్రాయపడ్డారు.

నిజాం తవ్విన గనులు..  
ఆస్ట్రేలియాలో ఒక ముడిసరుకు కోసం తవ్వకాలు జరిపే క్రమంలో మరిన్ని ఇతర ఖనిజాలను గుర్తిస్తుండటం తమ దృష్టికి వచ్చి తామూ అదేవిధంగా ముందుకు వెళ్లామన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక హట్టిలో బంగారంతోపాటు అనేక ఖనిజాలు ఉండవచ్చన్న ఆలోచన వచి్చందని, దీంతో వెంటనే పనులను, పరిశోధనలు ప్రారంభించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్‌ సంగూర్‌ తెలిపారు.

హట్టి గనుల్లో 1880– 1920 ప్రాంతంలో అప్పటి బ్రిటన్‌ శాస్త్ర వేత్తతో కలిసి  జాన్‌టైలర్స్‌ అండ్‌ సన్స్‌ మైనింగ్‌ను ప్రారంభించారన్నారు. 1887లో డక్కన్‌ నిజాం కంపెనీ ఆఫ్‌ హైదరాబాద్‌ స్వాధీనం చేసుకుని తవ్వకాలు ప్రారంభించిందన్నారు.  1902 నుంచి 1918 వరకు 1052 మీటర్ల లోతు నుంచి తవ్విన 3.8 లక్షల టన్నుల ఖనిజం నుంచి 7.41 టన్నుల బంగారాన్ని సాధించారు. అంటే టన్నుకు 19.45 గ్రాముల బంగారం  వెలికితీసినట్లు తెలిపారు. ఆ తర్వాత 1956లో హట్టి గోల్ట్‌ మైన్స్‌ కంపెని లిమిటెడ్‌ గా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top