
తల్లి పొత్తిళ్లకు దూరమై అనాథలా ఏడుస్తూ ఊయలలో పాపం..
సాక్షి, ఖమ్మం: తల్లి పొత్తిళ్లకు దూరమైన ఆ పసికందు.. పాపం అనాథలా ఏడుస్తూ ఊయలలో కనిపించింది. అది చూసి అంతా అయ్యో బిడ్డా అనుకుంటున్నారు. నగర కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు.
ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది చైల్డ్‌కేర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కర్కశకంగా వ్యవహరించిన తల్లిదండ్రుల తీరును తిట్టిపోస్తున్నారు ఆ దృశ్యం చూసినవాళ్లు.
బిడ్డలను వద్దనుకునే తల్లిదండ్రుల కోసం ఏర్పాటు చేసిన ‘ఊయల’లో ఈ చిన్నారిని వదిలేసి వెళ్లిపోయారు వాళ్లు. ఇలా వదిలేసిన తల్లిదండ్రుల కోసం సమాచారం సేకరించరు. ఖమ్మం శిశుగృహలో ఆ బిడ్డలను పెంచుతారు. ఎవరైనా ముందుకొస్తే దత్తతకు ఇస్తారు కూడా.