స్టాఫ్‌నర్స్‌ పోస్టులకూ ఆన్‌లైన్‌ పరీక్ష | Sakshi
Sakshi News home page

స్టాఫ్‌నర్స్‌ పోస్టులకూ ఆన్‌లైన్‌ పరీక్ష

Published Wed, May 3 2023 4:11 AM

Online Test for Staffers Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్యారోగ్య శాఖలో వివిధ విభాగాల్లోని స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్‌లైన్‌ విధానం(సీబీటీ)లో నిర్వహించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. పరీక్ష కోసం హైదరాబాద్‌తోపాటు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ల్లో సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకే రోజు రెండు సెషన్లలో.. ఉదయం సగం మందికి, సాయంత్రం సగం మందికి పరీక్ష నిర్వహిస్తారు. వైద్య, ఆరోగ్యశాఖ పరీక్ష పేపర్‌ను తయారు చేయగా, హైదరాబాద్‌ జేఎన్‌టీయూ పరీక్షలు నిర్వహిస్తుంది. ఒకట్రెండు నెలల్లో పరీక్ష జరిగే అవకాశం ఉందని సమాచారం. 

పేస్కేల్‌ పెరగడంతో భారీ డిమాండ్‌..   
కాగా, స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. 5,204 పోస్టులకు గాను ఇప్పటివరకు 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో స్టాఫ్‌నర్స్‌ పోస్టుకు ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ఈ పోస్టులకు పేస్కేల్‌ రూ. 36,750 – రూ. 1,06,990 మధ్య ఉండటంతో డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే వేలాది మంది అభ్యర్థులు కోచింగ్‌ తీసుకుంటున్నారు. రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. అనాటమీ, ఫిజియాలజీల్లో 14 అంశాలు, మైక్రోబయాలజీలో ఆరు అంశాలు పరీక్ష సిలబస్‌లో ఉంటాయి. ఈ మేరకు అభ్యర్థులు తయారు కావాలని  నిపుణులు సూచిస్తున్నారు. 

స్టాఫ్‌నర్సు రాత పరీక్ష సిలబస్‌ ఇదీ.. 
ఫస్ట్‌ ఎయిడ్, సైకాలజీ, సోషియాలజీ; ఫండమెంటల్స్‌ ఆఫ్‌ నర్సింగ్‌; కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్‌;ఎన్విరాన్‌మెంటల్‌ హైజీన్‌;   హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌;న్యూట్రిషన్, మెడికల్‌ సర్జికల్‌ నర్సిం­గ్‌; మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్,  చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్‌; మిడ్‌ వైఫరీ గైనకాలజికల్‌ నర్సింగ్‌; గైనకాలజియల్‌ నర్సింగ్,  కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్‌; నర్సింగ్‌ ఎడ్యు­కేషన్‌;ఇంట్రడక్షన్‌ టు రీసెర్చ్‌; ప్రొఫెష­నల్‌ ట్రెండ్స్‌ అండ్‌ అడ్జస్ట్‌మెంట్‌; నర్సింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వార్డ్‌ మేనేజ్‌మెంట్‌

Advertisement
Advertisement