
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్యామల
ఇంత దయనీయ పరిస్థితి రావడంతో ఆందోళనకు గురవుతున్నారు. దాతలు స్పందించి ఆపన్నహస్తం అందించాలని శ్యామల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): నిరుపేద కుటుంబానికి చెందిన ఓ వివాహిత కొనూపిరితో కొట్టుమిట్టాడుతోంది. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్యామల ఈ నెల 10న సదాశివనగర్ నుంచి ద్విచక్ర వాహనంపై కామారెడ్డి వైపునకు వెళ్తుండగా అకస్మాత్తుగా బైక్‌పై నుంచి రోడ్డుపై పడడంతో తలకుబలమైన గాయం అయింది.
(చదవండి: ప్రాణం తీసిన పట్టింపులు.. నిశ్చితార్థం రద్దయిందని..)
పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనమేరకు హైదరాబాద్‌లోని రెనోవా ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు రూ.30లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు మందుల ఖర్చుకు రూ.30వేలు ఖర్చు అవుతుందని కుటుంబీకులు పేర్కొన్నారు.
రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి బాధిత కుటుంబానిది. కూలి పని చేసుకునే వారికి ఇంత దయనీయ పరిస్థితి రావడంతో ఆందోళనకు గురవుతున్నారు. దాతలు స్పందించి ఆపన్నహస్తం అందించాలని శ్యామల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
(చదవండి: రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..)
గూగుల్ పే, ఫోన్ పే: (కుమార్) 8897507981,
బ్యాంక్ అకౌంట్ నెంబర్: 37911331015
IFSC Code: SBIN0005073
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా