NTPC: భారతావనికి వెలుగు దివ్వె.. ఎన్టీపీసీ

National Thermal Power Corporation Formation Day - Sakshi

 47 వసంతాలు పూర్తి చేసుకున్న సంస్థ

77 కేంద్రాల ద్వారా 70,254 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం

నవంబర్‌ 7న ఆవిర్భావ దినోత్సవం 

పెద్దపల్లి/జ్యోతినగర్‌: భారతావనికి వెలుగు ది వ్వెగా విరాజిల్లుతున్న నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్టీపీసీ) లిమిటెడ్‌ నేటితో 47 వసంతా లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సంస్థ దేశంలో 77 విద్యుత్‌ కేంద్రాల ద్వారా 70,254 మెగావాట్ల వి ద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. 2032 నాటికి 1,28,000 మెగావాట్ల లక్ష్యంతో నూతన ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తూ ముందుకు సాగుతోంది.

1975 నవంబర్‌ 7న నామకరణం
స్వాతంత్య్రం అనంతరం దేశంలో తీవ్ర విద్యుత్‌ కొరత ఏర్పడింది. దీంతో కేంద్ర పరిధిలో ఒక విద్యుత్‌ కేంద్రం ఉండాలని అప్పటి ప్రభుత్వం భావించింది. విద్యుత్‌ ప్రాజెక్టు పంపిణీ విధానం తమ ఆధీనంలో ఉండాలనుకుంది. విద్యుత్‌ కేంద్రం ఉన్న రాష్ట్రానికి ఎక్కువ శాతం కేటాయించి. మిగతా విద్యుత్‌ను ప్రాంతాల వారీగా పంపిణీ చే యాలని తీర్మానం చేశారు. అప్పటికప్పుడు విద్యుత్‌ కేంద్రం నిర్మించాలంటే సమయం పడుతుందని ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన బదర్‌పూర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని టేకోవర్‌ చేసింది. 1975 నవంబర్‌ 7న ఎన్టీపీసీ రిజిస్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌గా నమోదు చేసి, జాతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంగా నామకరణం చేసి, ఎన్టీపీసీగా గుర్తించారు.

దినదినాభివృద్ధి చెందుతూ..
ఎన్టీపీసీ దేశంలో బొగ్గు గనులు, గ్యాస్, నీరు, స్థలం అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, విద్యుత్‌ ప్రాజెక్టులను నెలకొల్పుతూ దినదినాభివృద్ది చెందుతూ అతిపెద్ద విద్యుత్‌ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచస్థాయి విద్యుత్‌ సంస్థలతో పోటీ పడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పవర్‌ ప్లాంట్‌ సామర్థ్యం, పీఎల్‌ఎఫ్, మెయింటెనెన్స్, విధానాలు, రక్షణ, విద్యుత్‌ పొదుపు, పర్యావరణ సమతుల్యం, మేనేజ్‌మెంట్‌ విధానాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎన్టీపీసీ సంస్థ విద్యుదుత్పత్తిలో అగ్రభాగాన నిలుస్తూ నవరత్న కంపెనీగా ఉన్న ఎన్టీపీసీ 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం చెందింది.

ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రాలు.. 
ఎన్టీపీసీ సొంతంగా బొగ్గు, గ్యాస్, హైడ్రో, సోలార్, ఫ్లోటింగ్‌ సోలార్, జాయింట్‌ వెంచర్స్‌తోపాటు మొత్తంగా 77 విద్యుదుత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. ప్రస్తుతం సూపర్‌ క్రిటికల్‌ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఎన్టీపీసీ తన ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి కన్సల్టెన్సీ, పవర్‌ ట్రేడింగ్, విద్యుత్‌ నిపుణుల శిక్షణ, బొగ్గు తవ్వకాల రంగాల్లో ముందుకు సాగుతోంది. మైనింగ్‌ రంగంలో వేగవంతమైన ప్రగతి నమోదు చేసింది.  

ఇతర సంస్థలతో కలిసి వ్యాపారం..
ఒకప్పుడు కేవలం విద్యుదుత్పత్తి మాత్రమే చేసిన ఎన్టీపీసీ ప్రస్తుతం ఉత్పత్తి, పంపిణీ, విద్యుత్‌ కొనుగోలు, అమ్మకాలు, సొంత బొగ్గు గనుల ఏర్పాటు, జాయింట్‌ వెంచర్లు తదితర ఎన్నో రంగాల్లో ఇతర సంస్థలతో కలిసి వ్యాపారాలు చేస్తూ దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగింది. జాయింట్‌ వెంచర్లతో బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాల్లో విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మిస్తోంది.  

2032 నాటికి, శిలాజ ఇంధనం ఆధారిత ఉత్పత్తి సామర్థ్యం ఎన్టీపీసీ యొక్క పోర్ట్‌ఫోలియోలో దాదాపు 30% ఉంటుంది. ఈ సంస్థ జాతీయ సామర్థ్యంలో 16.78% కలిగి ఉంది. ఎకనామిక్‌ టైమ్స్‌ సర్వే ప్రకారం దేశంలోనే అత్యుత్తమ 50 కంపెనీల్లో గుర్తింపు పొందింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top