95 ఏళ్ల వయసులో నేత్ర దానం 

Nandalalji Gupta Donated Eye At Age Of 95 Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: మరణానంతరం నేత్రాలు, అవయవాలు, శరీరదానం చేయడం వల్ల సొసైటీకి ఇంతకంటే చేసే మెరుగైన సేవ ఏదీ లేదనే ఉద్దేశంతో 95 సంవత్సరాల వయసులో మృతి చెందిన ఓ వృద్ధుడు తన మరణానంతరం నేత్రాలను దానం చేశారు. నందలాల్‌జీ పి.గుప్తా(95) గురువారం కన్నుమూశారు. బతికుండగానే ఆయన తన నేత్రాలను దానం చేయడంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు హైదరాబాద్‌కు చెందిన అమ్మ కంటి అవయవ శరీరదానం ప్రోత్సాహకుల సంఘం అధ్యక్షుడు గంజి ఈశ్వరలింగం ఆధ్వర్యంలో బజాజ్‌ ఐ బ్యాంక్‌కు అందజేశారు.  

60 ఏళ్ల వయసులో... 
తాను చనిపోయినా మరొకరికి వెలుగునివ్వాలనే ఉద్దేశంతో వల్లభనేని నర్సింహారావు(60) మరణానంతరం తన నేత్రాలను ఎల్వీ ప్రసాద్‌ ఐ బ్యాంక్‌కు అందజేశారు. బతికుండగానే ఆయన తన నేత్రాలను దానం చేయడంతో కుటుంబ సభ్యులు అమ్మ నేత్ర, అవయవ శరీరదాన ప్రోత్సాహకుల సంఘానికి సమాచారం అందించి ఆ మేరకు ఆస్పత్రికి అందజేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top